సక్సెస్ కోసం.. ‘హీరో’ గ్రూప్ డిస్కషన్స్ !

Published on Feb 28, 2019 4:36 pm IST

వరుస ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్న నాగశౌర్యకు ‘ఛలో’ రూపంలో భారీ సక్సెస్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ మాత్రం ఎక్కువరోజులు నిలబడలేదు. ఛలో తరువాత విడుదలైన ‘అమ్మమ్మగారిల్లు’, ‘@నర్తనశాల’ ‘కణం’ చిత్రాలు శౌర్య సక్సెస్ కు అడ్డంగా బ్రేక్ లు వేశాయి.

అయితే నాగశౌర్యలో హీరోతో పాటు ఓ స్క్రిప్ట్ రైటర్ కూడా ఉన్నాడు. ఛలో స్క్రిప్ట్ ను దర్శకుడు వెంకీతో పాటు నాగశౌర్య కూడా కలిసి తయారుచేశారట. ఈ విషయాన్ని ‘ఛలో’ ప్రమోషన్ల సమయంలో స్వయంగా నాగశౌర్యనే చెప్పారు. అలాగే నాగశౌర్యకు స్క్రిప్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వెంకీ కూడా చెప్పుకొచ్చాడు.

కాగా ఇప్పుడు నాగశౌర్య మళ్లీ ఓ మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నాగశౌర్యకు చాలా బాగా నచ్చిందట. ఆ స్క్రిప్ట్ ను ఇంకా బాగా బెటర్ చెయ్యడానికి, శౌర్య తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఆ దర్శకుడు దగ్గర స్క్రిప్ట్ వింటూ ఎప్పటికప్పుడు తనకు తోచిన కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారట. పై ఫోటో.. శౌర్య స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్నప్పుడు తీసిందే. మొత్తానికి సక్సెస్ కోసం.. నాగశౌర్య బాగానే ‘ గ్రూప్ డిస్కషన్స్ చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం నాగశౌర్య సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే సమంతా లీడ్ రోల్ లో వస్తున్న సినిమాలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. మొత్తానికి నాగశౌర్య తన తర్వాత చిత్రాలకి సంబంధించి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి మళ్లీ శౌర్య సక్సెస్ బాట పడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :