లేటెస్ట్ : నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

Published on Sep 8, 2022 5:30 pm IST

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మాతగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి. షేర్ల సెటియా హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, రాధికా శరత్ కుమార్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఫిలింగా రూపొందిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరిలో మూవీ పై మంచి ఆసక్తిని ఏర్పరిచింది. కాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని సెప్టెంబర్ 10 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ మూవీ హీరోగా నాగశౌర్య కి మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటోంది యూనిట్. కాగా కృష్ణ వ్రింద విహారి మూవీని సెప్టెంబర్ 23 న భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :