‘నాగబంధం’ ఇంటర్వెల్ ఇచ్చే హై మామూలుగా ఉండదట..!

‘నాగబంధం’ ఇంటర్వెల్ ఇచ్చే హై మామూలుగా ఉండదట..!

Published on Jul 2, 2026 8:59 AM IST

అభిషేక్ నామా దర్శకత్వంలో రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మైథలాజికల్ అడ్వెంచర్ ‘నాగబంధం’ జూలై 3న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమాపై ఉన్న భారీ క్రేజ్ కారణంగా జూలై 2నే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ సినిమా విజయంపై పూర్తి ధీమాను వ్యక్తం చేసింది. హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. శివుడిని, దర్శకుడిని నమ్మి ఈ ప్రాజెక్ట్ కోసం తన బెస్ట్ ఇచ్చానని, విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని తెలిపాడు.

భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు అభిషేక్ నామా పేర్కొన్నాడు. నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ.. అవుట్‌పుట్ చూశాక తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, కథనం, అపూర్వమైన విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని.. ఇంటర్వెల్ ఇచ్చే హై మామూలుగా ఉండదంటూ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు