టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ ఇంటర్నేషనల్ విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా ఓవర్సీస్ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ జీ స్టూడియోస్ కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించేందుకు ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ థియేటర్లలోకి అడుగుపెడుతోంది.
ఈ భారీ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ ప్రీమియర్ల షెడ్యూల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నార్త్ అమెరికా మరియు యూకే దేశాలలో జూలై 2వ తేదీనే గ్రాండ్‌గా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్‌ను, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 3, 2026న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా భాషల్లో రూపొందిన ‘నాగబంధం’ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
The legend travels beyond borders 🌍🔥#Nagabandham – The Secret Treasure arrives worldwide with overseas distribution by @ZeeStudios_
Premiere shows on 2nd July in the North America & UK
Get ready for an epic cinematic experience on the big screen!
In cinemas globally from… pic.twitter.com/AkzBaHSE9I
— ABHISHEK PICTURES (@AbhishekPicture) June 4, 2026


