డీసెంట్ లుక్ తో వచ్చిన నాగచైతన్య !

Published on Jul 9, 2018 1:17 pm IST

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయుకుడిగా రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. కాగా ఈ సినిమాలో ముఖ్యమైన అత్త పాత్రను ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఐతే ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ను చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. పోస్టర్స్ లో నాగచైతన్య లుక్ బాగుంది. మరో పోస్టర్ లో నాగచైతన్య, అనూ ఇమ‍్మాన్యూల్‌ తో పాటు రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.

ప్రధానంగా ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రం రూపొందుతుంది. సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు మారుతి శరవేగంగా షూట్ చేస్తున్నాడు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :