చైతు,సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల మొదలుపెట్టేశాడు.

Published on Jun 27, 2019 12:57 pm IST

అక్కినేని నాగ చైతన్య,సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నేడు ఈ మూవీని చిత్రం బృదం పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. సికింద్రాబాద్ లోగల గణేష్ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రంలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి,దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు చిత్ర నిర్మాత పాల్గొన్నారు.

నాగ చైతన్య 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఏషియన్ ఫిలిమ్స్,అమిగో క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుండి మొదలుకానుంది. ఈ చిత్రంలో మిగతా నటులతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలు తెలిసియాల్సివుంది .

సంబంధిత సమాచారం :

X
More