ప్రస్తుతం సోషల్ ఏర మీడియా ఎంతో డెవలప్ అయ్యింది.. ఏదన్నా ఇలా జరిగితే అప్పుడే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతోంది. సినిమా ప్రపంచం కూడా ఈ సోషల్ మీడియాని చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతోంది. ఎంతోమంది స్టార్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తమ అభిమానులకు టచ్ లో ఉన్నారు. ఇదే బాటలోనే అక్కినేని నాగార్జున కూడా ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో టచ్ లోనే ఉన్నారు. తాజాగా నాగార్జున సోషల్ మీడియాలో ఒక అరుదైన రికార్డ్ సాధించాడు.
ఆయన తాజాగా సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని క్రాస్ చేసాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో మహేష్ బాబు మాత్రమే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాడు, మహేష్ బాబు తరవాత నాగార్జునకి ఆ రికార్డ్ దక్కింది. వీరిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్(4.6 లక్షలు), ఎన్.టి.ఆర్ (3.6లక్షల) ఫాలోవర్స్ తో ఉన్నారు. ఈ నలుగురు హీరోస్ రెగ్యులర్ గా ట్వీట్స్ వేయకపోయినా వీరికి ఫాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా, కార్తీ – వంశీ పైడిపల్లి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
