దాస్ ఎమోషనల్ సీన్ విడుదలైయింది !

దాస్ ఎమోషనల్ సీన్ విడుదలైయింది !

Published on Sep 30, 2018 12:40 PM IST

Devadas m

యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం ‘దేవదాస్’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ డిలీటెడ్ సీన్‌ ని తాజాగా చిత్రబృందం యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఈ సీన్ లో నాని జాబ్ కోసం హాస్పిటల్ కి వచ్చే సీన్ అది. ఈ సీన్‌లో నాని మంచి ఎమోషనల్ గా నటించాడు.

సీన్‌లో మొదట రావు రమేష్… నానిని అవమానిస్తాడు. నీకు ఎక్కడా జాబ్ రాదనీ హేళన చేస్తాడు. కార్పొరేట్ హాస్పిటల్ సర్వీస్ మీద కంటే.. బ్రాండ్ మీదే ఎక్కువు నడుస్తోందని లెక్చర్లు పీకుతాడు. అలాగే అక్కడే ఉన్న తోటి కొలీగ్స్ కూడా, నాని గురించి అవమానంగా మాట్లాడటంతో.. ఎమోషనల్ అయిన నాని.. చాలా ఆవేశంగా మాట్లాడుతూ.. చాలా బాగా నటించాడు.

ఈ సీన్ కోసం కింద లింక్ క్లిక్ చెయ్యండి.

తాజా వార్తలు