ఊహించని కాన్సెప్ట్ తో నాగ్, ప్రవీణ్ సత్తారుల ఫిల్మ్.!

Published on Aug 29, 2021 10:21 am IST


టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఈరోజు కావున టాలీవుడ్ వర్గాలు తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ డే నే.. నాగ్ కొత్త ప్రాజెక్ట్ లు నుంచి అదిరే అప్డేట్స్ కూడా ఉన్నాయి. అయితే నాగ్ కెరీర్ లో తన కటౌట్ కి తగ్గ సినిమా అందులోని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఎక్కడా తగ్గకుండా ఉండే సబ్జెక్టు ని ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది.

టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ సాలిడ్ చిత్రాన్ని అనౌన్స్ చెయ్యగా దానిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే మొన్ననే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా దానిపై ఊహించని హైప్ కూడా నెలకొంది. హాలీవుడ్ లెవెల్ ఫీల్ ఇచ్చిన ఈ ప్రీ లుక్ పోస్టర్ ని రివీల్ చేస్తూ మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి “ఘోస్ట్” అనే పేరు పెట్టగా ఈ పోస్టర్ మాత్రం ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది.

వర్షంలో నాగ్ కట్టి పట్టుకొని ఉండగా ఎదురుగా కొంతమంది ఆంగ్లేయులు మోకాళ్లపై కూర్చొని వేడుకుంటున్నట్టు కనిపిస్తున్నారు పైగా ఈ పోస్టర్ ని కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ లో డిజైన్ చెయ్యడం ఈ సినిమా కాన్సెప్ట్ పై మరింత ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి మాత్రం నాగ్ కెరీర్ లో ఇది బెంచ్ మార్క్ సినిమాగా నిలవడం ఖాయం లా అనిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :