‘అఖిల్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించిన నాగ్!

‘అఖిల్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించిన నాగ్!

Published on Nov 1, 2015 5:57 PM IST

akhil
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్ మొదటి సినిమా, ఈ దసరా సీజన్‌కు వస్తుందని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హీరో నితిన్ నిర్మించారు. దసరాకు ఈ సినిమా వచ్చి తీరుతుందన్న ఆనందంలో ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడడంతో అఖిల్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా ఈ సినిమా దసరా రేసులో నిలవలేకపోయింది. ఇక వాయిదా పడినప్పట్నుంచే ఈ సినిమాపై రిలీజ్‌పై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. సినిమా డిసెంబర్ నెలకు వెళ్ళిపోయిందని, నవంబర్ నెలాఖర్లో విడుదవుతుందని ఇలా రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ఎట్టకేలకు కింగ్ నాగార్జున అఖిల్ సినిమా తాజా రిలీజ్ డేట్‌ను ప్రకటించేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా విడుదల కానుందని నాగార్జున కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. ఇక అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు మరో పదిరోజుల్లో అఖిల్ సినిమా రానుందన్న వార్త సంతోషాన్నిస్తోందనే చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు