అరవైయేళ్ల నవ మన్మధుడు…!

Published on Aug 29, 2019 10:57 am IST

కింగ్ నాగార్జున నేడు తన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆయన అక్కినేని వారసుడిగా తెరంగేట్రం చేసి కూడా దాదాపు 33 ఏళ్ళు గడుస్తుంది. 1986లో విడుదలైన విక్రమ్ చిత్రంతో ఆయన తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఆయన మొదటి హిట్ మాత్రం 1987లో దాసరి నారాయణ రావు తీసిన ట్రాజెడీ లవ్ స్టోరీ మజ్ను చిత్రంతో దక్కింది.

ఇక 1990లో నాగ్ కెరీర్ లోనే గొప్ప చిత్రాలుగా చెప్పుకొనే మణిరత్నం గీతాంజలి, వర్మ తెరకెక్కించిన శివ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇండస్ట్రీలో ప్రయోగాత్మక హీరోగా నాగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్నే పెళ్లాడతా వంటి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తరువాత అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకోవడం ఆయనకే చెల్లింది. దాదాలు 34 ఏళ్ల కెరీర్ లో నాగార్జున అనేక సూపర్ హిట్ మరియు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు.

వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా నిబద్దతతో ఉండే నాగ్ కి అరవై ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. అంత జాగ్రత్తగా ఆయన తన అందాన్ని, శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఆయన మన్మధుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

సంబంధిత సమాచారం :