‘మనం’ సినిమా తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమాకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఏన్నార్ నటించిన ‘ఆస్తిపరులు’సినిమాలో పాపులర్ హిట్ సాంగ్ ‘సోగ్గాడే చిన్ని నాయన…’ పల్లవిలో మొదటి పదాలను టైటిల్ గా తీసుకోవాలని నాగార్జున భావిస్తున్నట్టు సమాచారం. ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించలేదు. జగ్గయ్య, వాణిశ్రీ నటించారు. కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారట.
టైటిల్ విషయంలో నాగార్జున తన కుమారుడు నాగ చైతన్యను ఫాలో అవుతున్నారు. విడుదలకు సిద్దంగా ఉన్న నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా టైటిల్ ఏన్నార్ సినిమా(‘రాముడు కాదు భీముడు’)లో పాట నుండి తీసుకున్నారు. ఇప్పుడు నాగార్జున కొత్త సినిమాకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ టైటిల్ పెడుతున్నారు.
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్-ప్లే ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ సమకూరుస్తున్నారు. ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణను ఎంపిక చేశారు. మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.


