దేవదాస్ చిత్రం పట్ల సూపర్ హ్యాపీగా ఉన్న నాగ్ !

Published on Sep 27, 2018 3:22 am IST

యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం ‘దేవదాస్’. అయితే దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య పై నాగ్ కొంచెం అంసంతృప్తిగా ఉన్నాడని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. కాగా ఈ రోజు ఆ రూమర్స్ అన్నిటికీ నాగ్ చెక్ పెట్టారు. శ్రీ రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని.. ఖచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

ఇక ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా, నాని వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :