ఎట్టకేలకు బిగ్ బాస్-3కి హోస్ట్ గా స్టార్ ని పట్టేశారుగా…!

Published on Jun 6, 2019 12:33 pm IST

తెలుగు బుల్లి తెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో “బిగ్ బాస్”. తెలుగులో తొలి సీజన్‌కు హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ తన డాన్స్ మరియు హావభావాలతో ఆ సీజన్ ను సూపర్ సక్సెస్ చేశాడు, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఒక మూడో సీజన్‌ 3 ఎప్పుడు మొదలవుతుందా, హోస్ట్‌ ఎవరు అనే దానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. చివరిగా ఈ సస్పెన్సు కి తెరదించుతూ స్టార్ మా ఓ స్టార్ హీరో ని బిగ్ బాస్ 3 హోస్ట్ గా నియమించినట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం మీలో కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే బిగ్‌బాస్‌ 3ని హోస్ట్‌ చేయనున్నారని తెలుస్తుంది. అక్కినేని నాగార్జున ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్‌ ప్రకటన కూడా చేయనున్నారట. జూలైలో ఈ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ,నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌లో బిజీగా ఉన్నారు. నాగార్జున ఎంట్రీ తో ఈ షో మరో ఎత్తుకు చేరుతుందనడంలో సందేహంలేదు.

సంబంధిత సమాచారం :

More