మోహన్ లాల్, పునిత్ రాజ్ కుమార్ హీరోలుగా నటించిన ‘మైత్రి’ సినిమా కన్నడంలో ఘన విజయం సాదించింది. బాల నేరస్థుల జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు. కమర్షియల్ ఫార్మటులో మంచి మెసేజ్ అందించారని ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రసంశలు లభించాయి. ఈ సినిమా తెలుగు రీమేక్లో కింగ్ నాగార్జున నటిస్తారని ప్రచారం జరుగుతుంది.
‘మైత్రి’ నిర్మాత ఎన్.ఎస్. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. నాగార్జున గారితో ‘మైత్రి’ రీమేక్ గురించి చర్చలు జరిగాయి. సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. త్వరలో నాగార్జునకి హైదరాబాద్ లో స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నాం. ఆయనకు సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. అని తెలిపారు.
ప్రస్తుతం నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటిస్తున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి అంగీకరించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో కార్తి మరో హీరో.


