
‘తడాఖా’ సినిమాలో నటించిన ఆండ్రియా తన నటనతో చాలామందిని ఆకట్టుకుందట. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో సునీల్, తమన్నా ఈ అందాల భామ నటనను ప్రశంసించారు. తరువాత బెల్లంకొండ సురేష్ మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. మీడియా సమావేశంలో “తెలుగులో ఆండ్రియాకు ఇది మొదటి సినిమా అయినా ఆమె మంచి పాత్రలో నటించింది. నాగార్జున గారు ఈ సినిమాను చూసి ఆమె నటన ఆయనను ఆకట్టుకుందని తెలిపారు. అంతే కాక ఆమెను తదుపరి సినిమాలో కూడా తీసుకొమ్మని సలహా ఇచ్చారని”చెప్పారు. దీనిబట్టి ఆండ్రియా తదుపరి ఏ చిత్రంలో నటిస్తుంది అనేది ఉత్కంటగా మారింది. ఈ సినిమా కాకుండా ఆమెను ప్రిథ్వి రాజ్ సరసన ‘లండన్ బ్రిడ్జ్’ అనే మలయాళం సినిమాలో, కమల్ సరసన ‘విశ్వరూపం 2’ లో, ‘ఎంద్రెంద్రం పున్నాగై’ సినిమాలో చూడొచ్చు.
‘తడాఖా’ సినిమాలో నాగ చైతన్య, సునీల్, తమన్నా మరియు ఆండ్రియా నటిస్తున్నారు. కిషోర్ పర్దాన్సి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు. ఆర్థుర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా మే 10న మన ముందుకురానుంది.
ఆండ్రియా నటన నాగార్జునను ఆకట్టుకుందట
ఆండ్రియా నటన నాగార్జునను ఆకట్టుకుందట
Published on May 8, 2013 11:30 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
- నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఢీ’ సరికొత్త సీజన్: 5 భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైన పాపులర్ డ్యాన్స్ షో
- ఫోటో మూమెంట్: తన ‘శివాజీ’తో ఉమాదేవి.. మళ్ళీ రిపీట్ చేస్తున్నారా?
- అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘టాక్సిక్’ సునామీ: గంటలోనే 50 వేలు.. 20 లక్షల మార్కు దాటిన టికెట్ సేల్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

