నాగార్జునను గొప్ప లెజెండ్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ !

Published on Jul 1, 2018 11:45 am IST

సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అతిధి రావ్ హైదరి. మొదటిసారి తెలుగు సినిమాలో నటించినప్పటికీ అదితి రావ్ తన అందంతో పాటు తన అభినయాన్ని కూడా చక్కగా ప్రదర్శించి అన్నివర్గాల ప్రేక్షకులని అలరించి మెప్పించింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలవర్షం కురింపించగా, సెలెబ్రేటిస్ కూడా అతిధి అద్భుతంగా నటించిందని ప్రశంసించిన విషయం తెలిసిందే.

కాగా అతిధి రావ్ హైదరి ట్విట్ట‎ర్‎లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ..తాజాగా తెలుగు సినిమా సెలెబ్రేటిస్ మీద ప్రశంసలవర్షం కురింపించింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా నాగార్జున గొప్ప లెజెండ్ అని, ఆయనంటే తనకు ఎంతో గౌరవమని అతిధి రావ్ హైదరి తెలిపింది. అలాగే ఆమె ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో మాట్లాడుతూ ‘రాజమౌళిగారు తెలుగులో గొప్ప దర్శకులు అని, రాజుల కాలంనాటి కథలను పురాణ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తారని అతిధి రావ్ హైదరి చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :