బిగ్ బాస్ కోసం రంగంలోకి దిగిన నాగ్.

Published on Aug 1, 2020 11:28 am IST

బిగ్ బాస్ రియాలిటీ షో కి సర్వం సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో షూటింగ్ మొదలైంది. నాగార్జున ప్రోమో షూటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఈనెలలోనే బిగ్ బాస్ షో మొదలుకానుంది. ఇప్పటికే షోలో పాల్గొనే సెలెబ్రిటీల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలుస్తుంది.

బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలెబ్రిటీలు వీళ్ళేనంటూ అనేక పేర్లుప్రచారంలో ఉన్నాయి. ఐతే దీనిపై స్పస్టత రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక గత మూడు సీజన్లకు మించి ఫన్ అండ్ క్రేజీ గేమ్స్ తో బిగ్ బాస్ సీజన్ 4 సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిగ్ బాస్ షో అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More