నాగార్జున, కార్తి సినిమాలో సింగల్ హీరోయిన్.?

నాగార్జున, కార్తి సినిమాలో సింగల్ హీరోయిన్.?

Published on Oct 26, 2014 10:41 PM IST

nagarjuna-karthi

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు కౌంట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు సినిమాలు రాగా, కొన్ని సెట్స్ పై ఉన్నాయి. తాజాగా కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా తెలియజేశారు. ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఎవడు’ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనుంది.

ప్రసతుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకే ఒక హీరోయిన్ ఉంటుందని అంటున్నారు. కానీ ఇద్దరిలో ఒకరికే హీరోయిన్ ఉంటుందా లేక ఇద్దరు హీరోలు కలిసి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం వీరిద్దరికీ సరిపోయే హీరోయిన్ ని అన్వేషిస్తున్నారని సమాచారం. భారీ చిత్రాల నిర్మాత పరమ్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

తాజా వార్తలు