ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లోకి కాప్స్టన్.. బ్రాండ్ అంబాసిడర్‌గా నాగార్జున

ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లోకి కాప్స్టన్.. బ్రాండ్ అంబాసిడర్‌గా నాగార్జున

Published on Aug 13, 2026 8:00 AM IST

బిజినెస్-టు-బిజినెస్ (B2B) మానవ వనరుల సేవల రంగంలో గుర్తింపు పొందిన కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇప్పుడు ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ టెక్నాలజీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థ ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా హైదరాబాద్‌లో నూతనంగా ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ కన్స్యూమర్ యాప్‌ను ప్రారంభించింది.

​ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నాగార్జునను నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

​ఈ యాప్ ద్వారా బ్యూటీ, క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్, ఏసీ సర్వీసింగ్, హోమ్ అప్లయెన్సెస్ రిపేర్, పెస్ట్ కంట్రోల్ వంటి నిత్య జీవిత అవసరాలకు సంబంధించిన సేవలను వినియోగదారులకు అందించనున్నారు. శిక్షణ పొందిన నిపుణుల ద్వారా పారదర్శకమైన ధరలతో నాణ్యమైన సేవలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

​ప్రస్తుతం హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన ఈ యాప్‌ను త్వరలోనే ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాలకూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి తెలిపారు. టెక్నాలజీ ఆధారిత హోమ్ సర్వీసులను అందించడంతో పాటు దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన సర్వీస్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు