నిజంగా నాగ్ టాలీవుడ్ నవమన్మధుడే

Published on Jul 22, 2019 6:59 am IST

“మన్మధుడు 2” ఇంకా కొద్దిరోజులలో థియేటర్లలో సందడి చేయనుంది. కింగ్ నాగార్జున ముమ్మరంగా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా చిత్ర యూనిట్ ఓ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ లో నాగార్జున ని చూసిన ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. నాగార్జునకి అసలు ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే అనుమానం కలగక మానదు .ఇంకొద్ది రోజులలో 60ఏళ్ల వయసు పైబడనున్న నాగార్జున కేవలం 30ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. ఏమైనా నాగార్జున ఎవర్ గ్రీన్ నవమన్మధుడు అని నిరూపించుకుంటున్నాడు.

ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న మన్మధుడు 2 చిత్రానికి రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా రకుల్ ప్రీత్ నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More