జులై నుండి నాగ్ క్రేజీ సీక్వెల్ మొదలు !

Published on Apr 26, 2021 10:00 am IST

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” మంచి విజయాన్ని సాధించింది, ముఖ్యంగా ఆ సినిమాలో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ ఊపులో సోగ్గాడే చిన్ని నాయ‌న ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించటం జరిగింది. మధ్యలో కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో “రారండోయ్‌ వేడుక చూద్దాం” సినిమా చేశాడు. ఆ తరువాత కథ ఓకే చేయించుకుని బంగార్రాజు స్టార్ట్ చేద్దామనుకున్నా బిగ్ బాస్ షో, వేరే సినిమాలు, మరికొన్ని కారణాల వలన ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది.

అయితే బంగార్రాజు సినిమా జులై రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుందని నాగార్జున తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పార్ట్ లో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ కొనసాగుతుందని, ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావాల్సిందే.

సంబంధిత సమాచారం :