‘సీతారామం’ పై నాగ్ ప్రశంసలు ….!

Published on Aug 9, 2022 12:00 am IST

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తాజాగా నటించిన లవ్, రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక మందన్న ముఖ్య పాత్ర చేయగా వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, సుమంత్, భూమిక తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సీతారామం మూవీ పై ప్రేక్షకాభిమానులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇక నేడు ఈ మూవీని చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియచేసారు కింగ్ అక్కినేని నాగార్జున. సీతారామం మూవీ చూసాను నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది. నిర్మాతలు అశ్వినీదత్ గారికి, స్వప్నదత్ కి అలానే టీమ్ మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలియచేసారు నాగార్జున. ముఖ్యంగా ఈ మూవీని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :