నాగ్ తో డాషింగ్ డైరెక్టర్ ఫిక్స్ ?

Published on Jan 17, 2021 3:06 pm IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కింగ్ నాగార్జున కలయికలో ఓ సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ లో పూరి నాగ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. నాగార్జున కోసం ఓ ఫాంటసీ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మకకు చెందిన ఓ రాజు.. పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది మెయిన్ లైన్ అని సమాచారం.

ఇక నాగ్ – పూరి కలయికలో వచ్చిన శివమణి (2003) మరియు సూపర్ (2005) సినిమాలతో తమది క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు. మరి ‘శివ మణి’, ‘సూపర్’ సినిమాల రేంజ్ లోనే నాగ్ కు మళ్లీ పూరి, ఆ రేంజ్ హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ – డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో ‘ఫైటర్’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి పూరి ఫైటర్ తో హిట్ కొడతాడా చూడాలి.

సంబంధిత సమాచారం :