బాధ్యత మొత్తం భుజానికెత్తుకున్న నాగార్జున, సమంత !
Published on Oct 12, 2017 3:10 pm IST

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ రేపే రిలీజ్ కానుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఈ క్రేజ్ కు కారణం అందులో స్టార్ హీరో నాగార్జున ఆయన కోడలు సమంత నటిస్తుండటమే. నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటిస్తుండగా, సమంత ఆత్మగా కనిపించనుంది. ఇలా ఇద్దరు స్టార్లు ఆసక్తికరమైన, ముఖ్యమైన పాత్రలు చేస్తుండటంతో అవి ఎలా ఉంటాయో చూడాలని అందరూ ఉత్సుకతతో ఉన్నారు.

చిత్ర టీమ్ కూడా ఆరంభం నుండి వారిద్దరిని హైలెట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. అందుకే నాగార్జున, సమంతలు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుని బాధ్యత మొత్తం భుజానికెత్తుకుని ప్రమోషనల్లో పాల్గొంటున్నారు. సమంత అయితే పెళ్ళై వారం కూడా గడవకముందే, బిజీ బిజీగా ఉన్న కూడా తీరిక చేసుకుని మామగారైన నాగార్జునతో కలిసి ఈరోజు వివిధ ఇంటర్వూల్లో పాల్గొంటూ సినిమాలో భాగమైనందుకు తన వంతు భాద్యతను పరిపూర్ణం చేస్తున్నారు. మరి ఇన్ని అంచనాలున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

 
Like us on Facebook