‘నాని’ పక్కన అందమైన అమ్మాయి ఉన్నా పట్టించుకోడు – నాగార్జున

Published on Sep 23, 2018 1:12 pm IST


నాగార్జున, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా నాగ్ చేత, నాని గురించి ఓ ఇంట్రస్టింగ్ వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో నాగ్‌ తన ఫోన్‌ చూసుకుంటూ ఉండగా.. ఓ వ్యక్తి ఫ్రేమ్ లోకి రాకుండా ఆయన్ని పలకరిస్తాడు. దానికి సమాధానంగా నాగ్ ‘ఏదో అడిగారు.. (ఫోన్ చూపిస్తూ) ఇదా.. ఫోన్‌తో బిజీ. దాస్‌ కు ఇది పెద్ద అలవాటుగా మారిపోయింది. ఎప్పుడు ఫోన్‌లో ఏం చూస్తాడో నాకు తెలీదు. పక్కన ఒక అందమైన అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోడు. ఫోన్‌ పట్టుకుని అలా చూస్తూ ఉంటాడు.’ అని ‘నాకు ఎప్పుడూ చికాకు తెప్పించే నా ఫ్రెండ్ డాక్టర్‌ దాస్‌. మీకూ అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ట్యాగ్‌ చేయండి’ అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా, నాని వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :