దర్శకుడి కోసం నాగ్ వెతుకులాట ?

దర్శకుడి కోసం నాగ్ వెతుకులాట ?

Published on Dec 17, 2020 12:33 AM IST

Nagarjuna

స్టార్ హీరో నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ సినిమాను కంప్లీట్ చేశారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక తన తర్వాతి చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నారు. ఇది సంక్రాంతి తర్వాత మొదలుకానుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

దీని తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్న నాగ్ బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’ను తెలుగులోకి రీమేక్ చేయాలని చూస్తున్నారట. అజయ్ దేవగన్ హీరోగా చేసిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. ఇందులో హీరో ఆదాయ శాఖ పన్ను అధికారిగా ఉంటారు. అతని పాత్ర చుట్టూనే సినిమా ఉంటుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా నచ్చడంతో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారట నాగ్. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలనే విషయమై ఆలోచనలో ఉన్నారట ఆయన. ఒక్కసారి డైరెక్టర్ ఫైనల్ అయితే సినిమాను ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు