‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ని చెక్ చేసిన నాగ్ !

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ని చెక్ చేసిన నాగ్ !

Published on Apr 11, 2020 12:00 AM IST

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది. అందుకే నాగ్ ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు. లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు చెప్పారట. ఇక కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ జూన్ కు మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు