సూపర్ హిట్ మలయాళ మూవీ రీమేక్ లో నటించనున్న నాగార్జున ?

Published on Feb 21, 2023 3:06 am IST

కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక దాని తరువాత రచయిత ప్రసన్న కుమార్ బెజావాడ దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్న మూవీ చేయనున్నారు నాగార్జున. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పై ప్రసన్న కుమార్ కసరత్తు చేస్తున్నారట.

కాగా ఈ మూవీ ఇటీవల మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన పెరింజు మరియుమ్ జోస్ మూవీకి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. జోజు జార్జి హీరోగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా ప్రసన్న కుమార్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నారట. అతి త్వరలో అధికారికంగా ప్రకటన రానున్న ఈ మూవీలో ఇద్దరు టాలీవుడ్ యువ హీరోలు నటిస్తారట. కాగా ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :