అనుష్క సినిమాలో నాగార్జున అతిధి పాత్ర.!

అనుష్క సినిమాలో నాగార్జున అతిధి పాత్ర.!

Published on May 13, 2015 3:30 PM IST

Akkineni-Nagarjuna
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి.. అలాగే అనుష్క నాగార్జున మరో రెండు సినిమల్లో అతిధి పాత్రల్లో కూడా కనిపించింది. నాగార్జున – అనుష్కల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం అనుష్క లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సైజ్ జీరో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. నాగార్జున కుడా ‘సోగ్గాడే చిన్ని నాయనా’, కార్తీతో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

తాజా సమాచారం ప్రకారం అనుష్క నటిస్తున్న సైజ్ జీరో సినిమాలో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి పనిచేస్తున్న వారు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో ఓ కీలకమైన పాత్ర ఉంది, అది నాగార్జున చేస్తే సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం నాగార్జున ని అప్రోచ్ అయ్యారట. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆర్య, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఓ అతిధి పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది.

తాజా వార్తలు