నాగార్జున పాటను రీమిక్స్ చేయనున్న నాగ చైతన్య !

12th, April 2018 - 04:06:51 PM

భిన్నమైన కథలను ఎంచుకుంటూ ట్రాక్ మార్చిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా కోసం నాగార్జున సూపర్ హిట్ పాటల్లో ఒకటైన ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు’ పాటను రీమిక్స్ చేయనున్నారట.

ఈ పాట 1993లో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘అల్లరి అల్లుడు’ లోనిది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్నైతే సాధించిందో పాట కూడ అదే స్థాయి పాపులారిటీని దక్కించుకుంది. ఇకపోతే చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘సవ్యసాచి’ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ నటుడు మాధవన్ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు.