నగ్మా పెళ్లి.. నిజమేనా ?

Published on Apr 1, 2019 2:25 pm IST

ఇరవై ఏళ్ల క్రితం తన అందచందాలతో సౌత్ సినీ ఇండస్ట్రీస్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ లిస్ట్ లో హాట్ హీరోయిన్ గా నగ్మా పేరు ముందు వరుసలో ఉంటుంది. సౌత్ టాప్ హీరోలందరితోనూ జతకట్టిన నగ్మా, కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. అయితే వయసు పై బడి పదుల సంవత్సరాలు గడిచిపోయినా.. నగ్మా మాత్రం ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగ్మా తన పెళ్లి విషయం గురించి స్పందిస్తూ.. ‘‘జీవితంలో పెళ్లి అనేది దేవుడు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని.. ఇంక నా పెళ్లికి నేను వ్యతిరేకం కాదు’’ అని నగ్మా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడుకి చెందిన ఒక బిజినెస్ మెన్ ను నగ్మా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :