
హీరోయిన్స్ గా, ఐటమ్ గర్ల్స్ గా కొత్త కొత్త ఫారిన్ భామల్ని పరిచయం చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే చాలా మంది మోడల్స్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసారు. వారంతా ఇక్కడ బాగా సక్సెస్ అయ్యారు కూడా.. తాజాగా నాగార్జున – కార్తీ మూవీ సినిమాతో ఓ సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ మోడల్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. ఈ చిత్ర డైరెక్టర్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం సౌత్ ఆఫ్రికన్ మోడల్ అయిన గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ ని ఫైనలైజ్ చేసారు. గాబ్రియేల్ల సినిమాలో నాగార్జున పక్కన కనిపించనుంది. ప్రస్తుతం వీరిద్దరిపైన వచ్చే సన్నివేశాలను ఫారిస్ వీధుల్లో షూట్ చేస్తున్నారు.
‘ప్రస్తుతం నా బాబ్లీ కో స్టార్ అయిన గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ తో షూట్ చేస్తున్నానని’ నాగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీకి ‘దోస్త్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున – యంగ్ హీరో కార్తీ హీరోలుగా, మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. నిన్ననే ఈఫిల్ టవర్ వద్ద కొన్ని సీన్స్ షూట్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం పారిస్ వీధుల్లో కొన్ని చేజింగ్ సీక్వెన్స్ లని షూట్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ చిత్ర టీం పారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి రానుంది. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

