నిజమే.. మహేష్ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు !

Published on May 30, 2018 11:56 am IST

ఇన్నాళ్లు అన్ని సినిమాల్లోనూ దాదాపు ఒకే లుక్ తో కనబడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే తన 25వ సినిమాలో మాత్రం కొత్తగా కనిపించనున్నారు. గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నట్టే ఆయన రఫ్ లుక్ ట్రై చేస్తున్నారు. దీనికోసం జుట్టు, గడ్డం రెండూ కొద్దిగా పెంచుతున్నారు. మహేష్ సతీమణి నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన స్పెయిన్ హాలీడే ట్రిప్ ఫోటోలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది.

మరి మహేష్ కొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రానికి కె.యు.మోహన్ సినిమాటోగ్రఫీ అందివ్వనుండగా దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. జూన్ నెల 2వ వారం నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :