మహేష్ తో నమ్రత చెప్పేది అదొక్కటే..!

Published on Aug 9, 2020 4:09 pm IST

అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తరువాత అన్ని వర్గాలు మెచ్చిన హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోగా మహేష్ ఉన్నారు. మరి ఈ అమ్మాయిల కలల రాకుమారుడిని హీరోయిన్ నమ్రత శిరోద్కర్ సొంతం చేసుకుంది. అప్పుడెప్పడో వచ్చిన వంశీ సినిమాలో మహేష్ మరియు నమ్రత కలిసి నటించారు. అదే సమయంలో వీరు ప్రేమలో పడడం జరిగింది.

ఇక వీరి దాంపత్య జీవితం 15ఏళ్లుగా కొనసాగుతుంది . ఇక మహేష్ పై ప్రేమను నమ్రత ఈ విధంగా తెలియజేసింది ఆమె సోషల్ మీడియాలో ‘నీ నుంచి నిజమైన ప్రేమను పొందుతున్నాను. హ్యాపీ బర్త్ డే మహేశ్. ఇప్పుడైనా ఎప్పుడైనా నీకు చెప్పేది ఒకటే. ఐ లవ్ యూ” అని తెలిపారు నమత్ర శిరోద్కర్. ఈ మెసేజ్‌తో పాటు తనకు మహేశ్ ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటోను కూడా నమత్ర షేర్ చేశారు.

సంబంధిత సమాచారం :

More