ఘనంగా మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు, హీరోగా ఎంట్రీ ఖాయమేనా…?

ఘనంగా మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు, హీరోగా ఎంట్రీ ఖాయమేనా…?

Published on Sep 4, 2019 12:51 PM IST

నందమూరి అభిమానులు ఈనెల 6న బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ ఈ ఏడాది 25వ ఏట అడుగిడనున్నాడు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను గుంటూరు, విజయవాడ వేదికలుగా ఘనంగా నిర్వహిచడానికి నందమూరి అభిమానులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు ప్రకటించడం జరిగింది.

ఐతే గతానికి భిన్నంగా మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు ఇంత భారీ ఎత్తున నిర్వహిచడం వెనుక ఆంతర్యం, మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం కొరకేనా అనే అనుమానాలు తెలెత్తుతున్నాయి. మోక్షజ్ఞ కూడా 25ఏళ్ల వయసుకు చేరుకోవడంతో ఇక ఆలస్యం చేయకుండా ఆయనను వెండి తెరకు పరిచయం చేయాలనే ప్రణాలికను వేగవంతం చేస్తున్నారా అనిపిస్తుంది.

నిజానికి మోక్షజ్ఞని వెండి తెరపై హీరోగా చూడాలని ఎప్పటినుండో బాలయ్య అభిమానుల కోరిక. కానీ కారణాలేమైనా ఆ కార్యం వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం చేయడం కోసమో , లేక ఖాయం అయినందుకో ఇంత పెద్ద ఎత్తున్న జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారనే సందేహం కలుగుతుంది. మరి చూడాలి మోక్షజ్ఞ వారి ఆశలను ఎంత వరకు నెరవేర్చుతాడో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు