‘దేవినేని నెహ్రూ’ బయోపిక్ లో నందమూరి హీరో !

Published on Apr 24, 2019 11:41 pm IST

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. “దేవినేని” టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో
రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై దేవినేని నెహ్రూ బయోపిక్ గా తీస్తొన్న ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో తార‌క్ రత్న మాట్లాడుతూ… మా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితులైన వ్య‌క్తి. పెద‌నాన్న‌గారిలాంటివారు. ఆయ‌న పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కులు శివ‌నాగుగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ఆయ‌న ఎన్నో మంచి చిత్రాల‌ను తీశారు. ఈ సినిమాకి రాముగారిలాంటి మంచి ప్రొడ్యూస‌ర్ దొర‌క‌డం మా అదృష్టం. ఈ సినిమా మంచి హిట్ అయి ప్రొడ్యూస‌ర్‌కి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. మా అమ్మ జ‌మున చేతుల మీదుగా ఈ సినిమా రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :