‘పటాస్’ సినిమా సూపర్ హిట్ తో నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఫుల్ ఫాంలోకి వచ్చాడు. కానీ రీసెంట్ గా వచ్చిన షేర్ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కి నిరాశే మిగిల్చింది. దాంతో కళ్యాణ్ రామ్ఆచితూచి వరుసగా సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. ఇటీవలే గత ఏడాది ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఎఎస్ రవికుమార్ చౌదరి కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలియజేశాం.
ఇది కాకుండా దిల్ రాజు నిర్మాతగా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా సినిమా రూపుదిద్దుకుంటోంది. పటాస్ సినిమాని నైజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేడాడు. అప్పుడే కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తానని చెప్పిన దిల్ రాజు ప్రస్తుతం కొత్త రైటర్ హరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ ని ఓ కొత్త కోణంలో చూపించే విధంగా హరి కథని సిద్దం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించి, వచ్చే ఏడాది మొదట్లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.


