నందమూరి హీరోలకు శుభారంభం.!

నందమూరి హీరోలకు శుభారంభం.!

Published on Jan 24, 2015 5:28 PM IST

ntr-balakrishna-kalynaram-1

నందమూరి హీరోలకు ‘పటాస్’ ఘన విజయంతో 2015 ఘన స్వాగతం పలికింది. ఈ సినిమాలో ఆడియో వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్టు.. ‘రౌడీ ఇన్స్పెక్టర్’ తరహాలో అద్బుత విజయం సాదించి కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దిశగా సాగుతుంది. ఫస్ట్ బంపర్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ కు హిట్ లభించింది. ఈ విజయంతో అటు నందమూరి అభిమానులు, హీరోలు ఆనందంగా ఉన్నారు.

ఎన్టీఆర్ మాటలు ఫలించి ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత సినిమాలతో భారి విజయం అందుకొని ఎన్టీఆర్ ‘టెంపర్’తో బ్లాక్ బస్టర్ కొడతాడని అంటున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక, ‘లెజెండ్’ తర్వాత నందమూరి నట సింహం బాలయ్య నటిస్తున్న ‘లయన్’ మార్చిలో విడుదలవుతుందని టాక్. ఇలా వరుసగా ఒక్కో నెలలో ఒక్కో నందమూరి హీరో ఘన విజయం సాధించి తమను ఫుల్ ఖుషి చేస్తారని అభిమానుల ఆశ.

తాజా వార్తలు