
‘పటాస్’ సినిమా అందించిన ఘన విజయంతో నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ‘పటాస్’ విజయంలో వినోదం ముఖ్య భూమిక పోషించింది. అనిల్ రావిపూడి రాసిన కామెడీ పంచ్ డైలాగులు గట్టిగా పేలాయి. ప్రేక్షకుల స్పందన పట్ల కళ్యాణ్ రామ్ చాలా సంతోషంగా ఉన్నారు. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా లాభాలను తీసుకొచ్చింది. దాంతో, ఇకపై ఎంటర్టైన్మెంట్ కథలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
‘పటాస్’ తర్వాత మరో సినిమాకు కళ్యాణ్ రామ్ సంతకం చేయలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కొత్త స్క్రిప్ట్, కథలు వింటున్నారు. ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సీరియస్ యాక్షన్ సినిమాల జోలికి ఇప్పట్లో కళ్యాణ్ రామ్ వెళ్లకపోవచ్చని టాక్.

