నందమూరి హీరో రెమ్యునరేషన్ తీసుకోలేదట !

Published on Feb 28, 2019 9:18 am IST

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించాడు. ఇక ఈ పాత్ర చేసినందుకు గాను కళ్యాణ్ రామ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. చిత్ర నిర్మాతల్లోఒకరైన తన బాబాయి బాలకృష్ణ ఆయనకు పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చిన సున్నితంగా తిరస్కరిచాడట. అయితే రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో సినిమా ఫలితం పట్ల నిరాశ చెందాడట కళ్యాణ్ రామ్.

ఇక ఆయన నటించిన తాజా చిత్రం 118 రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల సరైన సక్సెస్ లేని కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :