అయ్యో.. ‘తారక్’కే ఎందుకు అలా !

Published on Mar 7, 2019 8:40 pm IST

తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ముందు వరుసలో చెప్పుకోవాల్సిన పేరు నంద‌మూరి కుంటుంబం. అలాంటి కుటుంబం నుంచి ఇంతకూ ముందు ఎవ్వరూ ఇవ్వనటివంటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ‘నంద‌మూరి తార‌క‌ర‌త్న‌’. మొదటి సినిమా కూడా చెయ్యకుండానే ఏకంగా ఏడు సినిమాలకు అగ్రీమెంట్ చేసిన ఏకైక తెలుగు హీరో ‘తార‌క‌ర‌త్న‌’ అనే చెప్పాలి.

అంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో హిట్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి, రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అమరావతి’ సినిమాలో విలన్ కూడా నటించాడు. అయినా, తారకరత్న కెరీర్ మాత్రం మారలేదు. పదుల సినిమాలు చేసాక కూడా కనీస స్థాయి హీరోగా కూడా తార‌క‌ర‌త్న‌ నిలబడలేకపోయాడు. చివరికీ ఊరు పేరు తెలియని హీరోల సినిమాలల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేస్తుంటే.. నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అలాంటి రోల్స్ చెయ్యొద్దు అని తారకరత్నకు కామెంట్లు పెడుతున్నారు.

అసలు ‘తారకరత్న’కే ఎందుకు ఎలా…? అమరావతి చిత్రంలో తన నటనగానూ ఉత్తమనంది అందుకున్నాక కూడా, నటుడిగా తారకరత్నకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటో. కావాల్సినంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పెట్టుకుని కూడా కెరీర్ ను మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం తారక్ రత్న సోలో హీరోగా శివ‌ప్ర‌భు అనే కొత్త దర్శకుడు ద‌ర్శ‌క‌త్వంలో `అమృత వ‌ర్షిణి` అనే ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మంచి ఇంటెన్సీ ఉన్న స్టోరితో రాబోతుందని తెలుస్తోంది. అలాగే పి. ఎల్. కె. రెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్స్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమాలో కూడా తారకరత్న కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మరి కనీసం ఈ చిత్రాలతోనైనా తారక్ రత్న హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More