టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో సమంత చేస్తున్న పాత్రపై డైరెక్టర్ నందిని రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి ఈ సినిమాలో సమంత పాత్రను సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘భాషా’తో పోల్చారు. ఈ సినిమాలో సమంతను చూస్తే భాషా గుర్తుకు వస్తాడని ఆమె తెలిపింది. అలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో సమంత ఇరగదీసిందని.. సామ్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు థ్రిల్ అవుతారని నందిని రెడ్డి పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ అవుతాయని ఆమె తెలిపింది. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచలె, గౌతమి, శ్రీముఖి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


