గ్రాండ్ లాంచ్ కి రెడీ అయ్యిన “నాని 30”.!

Published on Jan 28, 2023 12:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” పై ఎనలేని హైప్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత గెటప్ మర్చి అనౌన్స్ చేసిన తన కెరీర్ 30వ చిత్రంపై మరింత హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రంని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించనుండగా వైరా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

మేకర్స్ ఈ చిత్రం తాలూకా గ్రాండ్ లాంచ్ ని ఈ జానాతి 31 కి లాక్ చేశారట. అనేకమంది సినీ ప్రముఖులతో ఈ 31న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రం ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుండగా సీతా రామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :