బాలీవుడ్లోకి వెళ్ళడానికి నాని రెడీ.. కానీ అదే సమస్య

Published on May 8, 2021 1:30 am IST

తెలుగు హీరోలు ఈ మధ్యన హిందీ మార్కెట్ మీద కూడ దృష్టిపెడుతున్నారు. వీలుంటే నేరుగా బాలీవుడ్లో సినిమా చేయాలని చూస్తున్నారు. హీరో నానికి కూడ ఈ కోరిక ఉంది. మంచి కథ దొరికితే తప్పకుండా హిందీలో సినిమా చేస్తానని ఆయన అంటున్నారు. కానీ ఇక్కడే ఒక ఇబ్బంది ఉంది. అదే భాష. తనకు హిందీ లాంగ్వేజ్ వచ్చు కానీ మరీ సినిమా చేసేంత అయితే రాదని అంటున్న నాని సినిమా చేస్తే తాను కొత్త వ్యక్తిలా అనిపించకూడదని అభిప్రాయపడుతున్నారు.

అందుకోసం హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు. మరి నేర్చుకోవచ్చు కదా అంటే ఎవరైనా హిందీ మేకర్స్ కథ తీసుకొచ్చి అది తనకు నచ్చాలని, ఎంతలా అంటే ఈ సినిమా చేయడానికైనా తప్పకుండా హిందీ నేర్చుకోవాలనే తపన తనలో పుట్టాలని అలా తనను కదిలించగలిగే కథ వచ్చినప్పుడు చేస్తానని అంటున్నారు నాని. మరి నాని కోసం ఎవరైనా అలాంటి కథను తయారుచేసి తీసుకొస్తారేమో చూడాలి. ఇకపోతే నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి’ సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘టక్ జగదీష్’ కంప్లీట్ కాగా మిగతా రెండూ సెట్స్ మీద ఉన్నాయి.

సంబంధిత సమాచారం :