డైరెక్టర్ కావాలని వచ్చి హీరోగా మారి తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని, సినిమా అంటే భారే బడ్జెట్ అవసరం లేదు లో బడ్జెట్ లో కూడా ప్రేక్షకులను అమితంగా మెప్పించవచ్చు అని నిరూపించిన డైరెక్టర్ మారుతి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘భలే భలే మగాడివోయ్’. అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా కనిపించనుంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒకే ఒక్క సాంగ్ షూట్ మిగిలి ఉంది. ఇటీవలే నాని – లావణ్యలపై వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ ని గోవా బీచ్ లో షూట్ చేసారు,
రొమాంటిక్ సాంగ్ షూట్ చేసిన ఈ చిత్ర టీం నేటి నుంచి ఓ ఫుల్ మాస్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో నాని – లావణ్యలు పలు డిఫరెంట్ మాస్ స్టెప్స్ తో ఆడియన్స్ ని మెప్పించడానికి ట్రై చేయనున్నారు. ఓపి సుందర్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ కూడా వినగానే ఆడియన్స్ బాగా నచ్చేలా ఉంటుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


