నాని నయా అవతారం ఎత్తాడుగా …!

Published on Aug 17, 2019 5:41 pm IST

నాని హీరోగానే కాకుండా నిర్మాతగా ,డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతున్నారు. ఈయన కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా చెప్పడం జరిగింది .అలాగే గత బిగ్ బాస్ సీజన్2 ని విజయవంతంగా నడిపించారు. ఇవిగాక నాని మరో కొత్త అవతారం ఎత్తాడు. ప్రముఖ శీతల పానీయం అయిన స్ప్రైట్ కి ప్రచార కర్తగా మారాడు. దానికి సంబంధిన వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. అలాగే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది.

కాగా నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈనెల 30న విడుదల కావల్సివున్న ఈ మూవీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని కామెడీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారని సమాచారం. నాని ఈ మూవీలో రివేంజ్ స్టోరీ రైటర్ గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :