ఓటీటీ సంస్థలకు సేవియర్‌గా మారిన నాని

ఓటీటీ సంస్థలకు సేవియర్‌గా మారిన నాని

Published on Mar 18, 2025 7:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని తీసే సినిమాలకు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. నాని నటించే సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇక ఇప్పుడు నాని చేస్తున్న సినిమాలకు కేవలం ప్రేక్షకులే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా ఫిదా అవుతున్నాయి. ఆయన నటించే సినిమాలు.. ప్రొడ్యూస్ చేసే సినిమాలను భారీ రేటుకు దక్కించుకుంటున్నారు.

తాజాగా నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘కోర్ట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. దీంతో నాని నెక్స్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.

దీంతో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి అప్పుడే సొంతం చేసుకుందట. నానిపై ఏ రేంజ్‌లో కాన్ఫిడెన్స్ ఉంటే, ఇలా ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఓటీటీ రైట్స్ కొనుగోలు అవుతాయి. మొత్తంగా నాని ఓటీటీ సంస్థలకు సేవియర్‌గా మారాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు