మైఖేల్ జాక్సన్ X పవన్ ఎడిట్స్ తో సోషల్ మీడియా షేక్!

మైఖేల్ జాక్సన్ X పవన్ ఎడిట్స్ తో సోషల్ మీడియా షేక్!

Published on Feb 19, 2026 10:32 PM IST

pawan-kalyan-michael

ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం మన తెలుగు ఆడియెన్స్ లోనే కాకుండా వెస్ట్రన్ ఆడియెన్స్ లో కూడా రెండే రెండు ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తున్నాయి. పాప్ సామ్రాజ్యం మహారాజు మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్రపై తెరకెక్కిన అవైటెడ్ బయోపిక్ చిత్రం ‘మైఖేల్’ ఈ ఏప్రిల్ లో రిలీజ్ కి రాబోతుంది. మేకర్స్ కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఆల్రెడీ సోషల్ మీడియాలో కంటెంట్ కి కూడా సాలిడ్ బజ్ నమోదు అయ్యింది. అయితే మన తెలుగు ఆడియెన్స్ సోషల్ మీడియాలో మెయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మైఖేల్ జాక్సన్ ఎడిట్స్ మాత్రం సోషల్ మీడియాని టేకోవర్ చేసేసారు. ఇది వరకు కూడా పవన్, మైఖేల్ జాక్సన్ పై ఒకటీ రెండు ఎడిట్స్ మంచి రీచ్ సొంతం చేసుకున్నాయి.

కానీ ఇప్పుడు మైఖేల్ జాక్సన్ విజువల్స్ కి పవన్ ఓజి, తమ మ్యూజిక్ కలిపిన విజువల్స్ అటు వెస్ట్రన్ ఆడియెన్స్ లో కూడా ఓ రేంజ్ లో రీచ్ సొంతం చేసుకున్నాయి. వీటితో పాటుగా లేటెస్ట్ గా దేఖేలేంగే సాలా అంటూ వచ్చిన ఎడిట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా పవన్ X మైఖేల్ జాక్సన్ ల కాంబినేషన్ మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేస్తుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు