14 రీల్స్ మూవీ మొదలెట్టిన నాని

14 రీల్స్ మూవీ మొదలెట్టిన నాని

Published on Jun 21, 2015 6:48 PM IST

nani
కొన్ని ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నాని వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమా షూటింగ్ ని దాదాపు ఫినిష్ చేసాడు. ఇదలా చివరికి వచ్చిందో లేదో అప్పుడే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్దమయ్యాడు. మారుతి సినిమా తర్వాత నాని అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవ పూడితో ఓ సినిమా చేయడానికి సైన్ చేసాడు.

నాని – హను రాఘవపూడి సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు లాంచనంగా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మొదటి సినిమాతో మంది ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హను ఈ సారి అటు నాని కెరీర్ కి, ఇటు తన కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చేలా కథని సిద్దం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

తాజా వార్తలు